రాజుగారి క్రెడిట్ నాగ్ ఖాతాలోకే.. !

nag

రాజుగారి గది 2 రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇది నాగార్జున సినిమాగానే ప్రమోటైంది. ఆయన సినిమాగానే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇందులో నాగ్ రుద్ర అనే మెంటలిస్టు పాత్రలో కనిపించబోతున్నాడు. సమంత దెయ్యంగా కనిపించనుంది. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ లో నాగ్ చేసింది గెస్ట్ రోల్ మాత్రమే. అయినా.. సొంత సినిమాలా ట్రీట్ చేశారు. బాగా రాలేదని భావించిన సీన్స్ ని రీ-షూట్ చేయించారు. విజువల్ ఎఫెక్ట్ విషయంలోనూ ప్రత్యేక శ్రద్ద చూపారు.

అంతేకాదు.. దగ్గరుండి ఫైనల్ కాపీ రెడీ చేయించాడు. ఎడిటింగ్ టేబుల్ దగ్గర కూర్చొని కత్తెరకు పనిపెట్టాడు. చెత్తంతా తీసేసి సినిమా నివిడిని కేవలం 2గంటలుగా రెడీ చేశారు. సినిమా నిడివి కేవలం 127 నిమిషాలు మాత్రమే. దీంతో ప్రేక్షకుడు బోర్ గా ఫీలయ్యే ఒక్కటంటే ఒక్క సీన్ కూడా ఉండదని చెబుతున్నారు.

ఈ క్రమంలో రాజు గారి గది 2 హిట్టయినా, ఫట్టయినా.. ఆ క్రెడిట్ నాగార్జునదేననే గుసగుసలు వినబడుతున్నాయి. దర్శకుడు ఓంకార్ నే అయినా.. నాగార్జున తన టేస్ట్ కి దగ్గట్టుగా సినిమాని తీయించాడని చెప్పుకొంటున్నారు.