రకుల్ ఫుల్ హ్యాపీ

rakul-preet

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘బేటీ బచావో, బేటీ పడావో’ కార్యక్రమానికి టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ప్రచారకర్తగా ఎంపికైంది. ఆమె తెలంగాణ రాష్ట్రానికి ప్రచారకర్తగా నియమించారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర చేనేత ప్రచార కర్తగా స్టార్ హీరోయిన్ సమంత కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ‘బేటీ బచావో, బేటీ పడావో’ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ప్రచార కర్తగా రకుల్ ని ఎంపిక చేశారు.

దీనిపై రకుల్ ఆనందం వ్యక్తం చేసింది. “‘బేటీ బచావో, బేటీ పడావో’ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ప్రచార కర్తగా ఎన్నిక కావడం ఆనందంగా ఉంది. మార్పు ని మొదలెడదాం” అంటూ ట్వీట్ చేసింది.

ఇక, హీరోయిన్ టాలీవుడ్, కోలీవుడ్ లోనూ రకుల్ అవకాశాలని అందుకుంటోంది. మరోవైపు, ఆమె హైదరాబాద్, వైజాగ్ లలో ఫిట్ నెస్ బిజెనెస్ నడుపుతున్న విషయం తెలిసిందే.