రకుల్’కు రాత్రుళ్లు నిద్రపట్టడం లేదు.. ఎందుకో తెలుసా ?

rakul

స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కు రాత్రిళ్లు నిద్రపట్టడం లేదట. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తెలిపింది. రకుల్ చెప్పిన దాని ప్రకారం ఈ ముద్దుగుమ్మ ప్రేమలో పడి ఉంటుంది. లేదంటే ఆమె మనసు పెళ్లి వైపు లాగి ఉంటుందని అనుకొంటారు. అయితే, రకుల్ సమాధానం మాత్రం డిఫరెంటుగా ఉంది.

rakul1

తాజాగా, రకుల్ తన ఇన్ స్ట్రాగ్రాంలో ఓ పోస్ట్ చేస్తూ “రాత్రి పూట ఎందుకు నిద్ర‌ప‌ట్ట‌ట్లేద‌ని నేను నా హృద‌యాన్ని అడిగాను” అని ఆమె పేర్కొంది. దానికి త‌న హార్ట్ స‌మాధానం ఇస్తూ.. ‘ఎందుకంటే నీవు మ‌ధ్యాహ్నం పూట ప‌డుకుంటున్నావు.. నీవు ప్రేమ‌లో ఉన్న‌ట్లు న‌టించ‌కు’ అని చెప్పిందని ఈ అమ్మ‌డు పేర్కొంది. ఈ పోస్టుని చూసి ఆమె అభిమానులు ఎంజాయ్ చేస్తున్నారు.

మరోవైపు, ఇటీవలే ప్రేమలో పడినట్టు పరోక్షంగా రకుల్ సంకేతాలు ఇస్తుందని కొందరు గుసగుసలాడుకొంటున్నారు. ఆ విషయం తనని ప్రేమిస్తున్న యువకుడికి తెలియజేసేందు.. ఈ రకమైన చిలిపి పోస్టు పెట్టినట్టు చెప్పుకొంటున్నారు. ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.