రకుల్ ఎలాంటి సాహసం చేసిందో తెలుసా..?

వేంకటాద్రి ఎక్స్ ప్రెస్ తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన రకుల్ ప్రీతీ సింగ్..తన కెరియర్ ను కూడా అంతే స్పీడ్ గా తీసుకెళ్లింది. కానీ అంతే స్పీడ్ గా తగ్గిపోయింది. ప్రస్తుతం అమ్మడు దేవ్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. గత ఏడాది ఒక్క సినిమాతో కూడా తెలుగు ప్రేక్షకుల ముందుకు రాలేకపోయింది రకుల్..దేవ్ తో పాటు మరో రెండు , మూడు సినిమాలతో రాబోతున్నట్లు తెలుస్తుంది.

తాజాగా దేవ్ ప్రమోషన్లలో మాట్లాడుతూ దుబాయ్ లో చేసిన ఓ సాహసాన్ని తెలిపి అభిమానులకు షాక్ ఇచ్చింది. 15 వేల అడుగుల ఎత్తు నుంచి దూకేసిందట.. ప్యారాచూట్ సాయం తో దూకేసిందిలే కానీ టైం బాగోక అవి కానీ అనుకున్నట్లుగా ఓపెన్ కాకుంటే.. ప్రాణాలు పోవటం ఖాయం. అలాంటి సంఘటనలు చూస్తూనే ఉన్నాం..ఇలాంటి సాహసం చేయడం ఏంటి అని అంత ప్రశ్నించారు. ఇలాంటి సాహసాలు రకుల్ కు కొత్తేం కాదు. గతంలో స్కూబా డ్రైవ్.. బంగీ జంప్ చేసిన రకుల్ ఈసారి ఏకంగా స్కై డ్రైవింగ్ చేసినట్లు తెలిపింది.