రాజుగారి ‘ప్రియురాలు’ రెడీ అయ్యింది

16-ramaraju-mtlsp-1
మల్లెల తీరంలో సిరిమ‌ల్లె పువ్వు లాంటి క్లాస్ సినిమా తీశాడు రామ‌రాజు. దర్శకుడిగా ఇదే ఆయన మొదటి సినిమా. ఆడలేదు కానీ మంచి పేరొచ్చింది. సినిమా చూస్తున్నప్పుడు క‌థ‌లా కాకుండా ఓ పొయెట్రీలా అనిపిస్తోంది మల్లెల తీరం. ఈ సినిమాలో రామ‌రాజు క్లాస్ అడియన్స్ కనెక్ట్ అయ్యారు.

అయితే మెగాడాటర్ నిహారికతో తీసిన ‘ఒక మానసు’ మాత్రం దారుణంగా విఫలమైయింది. క్లాస్ టచ్ కాదు కదా మరీ నీరసంగా తయారైయింది. దీంతో రిజల్ట్ కూడా నీరసంగా తయారైయింది. ఈ సినిమాకి మధుర శ్రీధర్ నిర్మాత. నష్టాల్ని చూశారు.

అయితే రామరాజుపై ఆయనకు నమ్మకం పోలేదు. అందుకే రామరాజుతో మరో సినిమాని ప్లాన్ చేస్తున్నారు. దీనికి టైటిల్ కూడా ఖారరైపోయింది. అదే ప్రియురాలు. ఇదీ ఓ ప్రేమ కధే. ప్రీ ప్రొడక్షన్ పనులు చివరి దశకు వచ్చాయి. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.