స‌ల్మాన్‌ రంభ.. సూపర్ !

టాలీవుడ్ లో స్టార్ హీరోలందరితోనూ ఆడిపాడింది సీనియర్ హీరోయిన్ రంభ. పెళ్లైన తర్వాత కూడా ఒకట్రెండు సినిమాల్లో ఐటమ్ సాంగ్ లో మెరిసింది. ఇప్పుడు రీ-ఎంట్రీ ఇచ్చేందుకు రెడీగా ఉన్న ఆఫర్లు రావడం లేదు. బుల్లితెర అయినా సరిపెట్టుకొన్నేలా కనబడుతోంది. ఇప్పుడీ ముద్దుగుమ్మ బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ పక్కన తళుక్కుమనడం హాట్ టాపిక్ గా మారింది.

ప్రస్తుతం సల్మా అమెరికాలో ఉన్నాడు. అక్కడ ‘ద – బాంగ్‌’ షోతో బిజీగా ఉన్నాడు. సల్లూ భాయ్‌ షోకు సీనియర్ హీరో రంభ ఫ్యామిలీతో కలిసి వచ్చింది. ప్రస్తుతం ఆమె​ తన భర్త, పిల్లలతో కలిసి అమెరికా విహారయాత్రలో ఉన్నారు.‘ద – బాంగ్‌’ కార్యక్రమానికి హజరైన రంభ.. సల్మాన్ ఖాన్ తో ఫోటోలు దిగింది. జాక్వెలిన్‌, కత్రినా కైఫ్‌, సోనాక్షి సిన్హా, ప్రభుదేవా వంటి బాలీవుడ్‌ ప్రముఖులందరిని కలిసింది. ‘జుడ్వా’ సినిమాలో సల్మాన్ తో జతకట్టింది రంభ.