రానా.. ఏపీ ముఖ్యమంత్రి ?

టాలీవుడ్ యంగ్ హీరో రానా దగ్గుపాటికి పొలిటిక్స్ బాగా అచ్చొస్తాయి. ఆయన ‘లీడర్’గా తెరకు పరిచయమయ్యారు. ముఖ్యమంత్రిగా ప్రేక్షకుల మనసు దోచుకొన్నారు. బాహుబలి సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకొన్నాడు. ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమాలో మరోసారి ముఖ్యమంత్రిగా దర్శనమిచ్చాడు. కుర్చీలాట మొదలెట్టి కేక పుట్టించాడు. ఇప్పుడు 2019 సాధారణ ఎన్నికలు దగ్గర పడుతున్న టైంలో రానా నిజంగానే ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉన్నాయని చెప్పుకొంటున్నారు.

క్రిష్ దర్శకత్వంలో ‘ఎన్ టీఆర్’ బయోపిక్ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఎన్ టీఆర్ పాత్రలో బాలయ్య కనిపించనున్నాడు. బాలయ్యకు జోడిగా విద్యాబాలన్ జతకట్టనుంది. ముఖ్యమంత్రి పాత్ర నాదేండ్ల భాస్కర్ రావు పాత్రలో బోమన్ ఇరానీ కనిపించనున్నాడు. ఇక, ఆంధ్రప్రదేష్ ముఖ్యమంత్రి చంద్రబాబు పాత్ర కోసం రానా ని తీసుకోవాలని క్రిష్ భావిస్తున్నట్టు సమాచారమ్. ఇదే నిజమైతే… రానా మరోసారి ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం.