షాక్ : రానా-రెజీనాల నిశ్చితార్థం

Rana-Regina

రానా దగ్గుపాటి నిశ్చితార్థం యంగ్ హీరోయిన్ రెజీనాతో జరిగిపోయింది. రానును పెళ్లి చేసుకొనేందుకు రెజీనా వెయిట్ చేస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా రానా తెలపడం విశేషం. అయితే, రియల్ లైఫ్ లో కాదులేండీ.. ! రీల్ లైఫ్ లో. స్వాతంత్య్రం కోసం పోరాడిని సమరయోధుడు ‘సుభాష్‌ చంద్రబోస్‌’ ఇతివృత్తంతో ఓ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే.

సత్యశివ దర్శకత్వం వహిస్తోన్న ఆ సినిమా పేరు ‘మదై తీరాతు’. తెలుగులో ఈ సినిమాకి ‘1945’ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఇందులో రానా ఆర్మీ ఆఫీసర్ గా కనిపించబోతున్నారు. ఈ సినిమా తొలి షెడ్యూల్ పూర్తయ్యింది. త్వరలోనే రెండో షెడ్యూల్ మొదలవ్వనుంది. ఈ చిత్రంలో రానాను పెళ్లి చేసుకోవడానికి నిశ్చయించబడ్డ యువతిగా రెజీనా నటించనుంది. ఇందులో ఆమె మేకప్‌తో విభిన్న గెటప్‌లో కనిపించనున్నారని చెబుతున్నారు.

1945 కాల ఘట్టంలో జరిగే కథా చిత్రంగా తెరకెక్కనున్న మరో గొప్ప కళాఖండంగా ఈ చిత్రం ఉంటుంది. బాహుబలి చిత్రంతో అనుష్క, తమన్నా ఎంత పేరు సంపాదించుకున్నారో.. ఆ రేంజ్ ఈ సినిమాకి రెజీనాకు పేరొస్తుందని రానా చెబుతున్నాడు.