అదిగో రానా చాట్ చేశాడు

రానా దగ్గుపాటి క్లారిటీ ఇవ్వాల్సిన విషయాలు చాలానే ఉన్నాయి. ఆయన అనారోగ్యం, త్రిష మేటరు, చంద్రబాబు పాత్ర, పెళ్లి కబరు.. ఇలానే ఉన్నాయి. ఇప్పుడా అవకాశం ప్రేక్షకులకి దొరికింది. సురేశ్‌ ప్రొడక్షన్స్‌ నిర్మాణంలో తెరకెక్కిన చిత్రం ‘అదుగో’. రవిబాబు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ రోజు రానా చేతుల మీదుగా ట్రైలర్‌ విడుదల చేయాలనుకున్నారు. కానీ ట్రైలర్‌ విడుదల చేయడం కాస్త ఆలస్యం కావడంతో కాసేపు రానా ట్విటర్ చాట్‌ చేశారు.

ఈ సందర్భంగా.. త్రిషతో కలిసి ఎప్పుడు సినిమా చేస్తారు ? అన్న ప్రశ్నకు మంచి కథ దొరికినప్పుడు అని సమాధానం ఇచ్చారు.
ఎన్టీఆర్‌ బయోపిక్‌లో మీ పాత్రకు సంబంధించిన సర్‌ప్రైజ్‌ ఎప్పుడిస్తారు ? ఈరోజు ఇస్తే ఎలా ఉంటుంది ? అన్నారు. మీ ఆరోగ్యం ఎలా ఉంది ? అని ఓ అభిమాని అడగగా బాగుందన్నారు. ఒక పాత్ర మీకు బాగా నచ్చి కొన్ని కారణాల వల్ల చేయలేనని వదిలేసిన సినిమా ఏదైనా ఉందా? అదే జరిగితే నేను సినిమాలు మానేస్తానన్నారు రానా.