మహర్షి దెబ్బకు రంగస్థలం కలెక్షన్ల అడ్రెస్ లేదు..

ముందునుండి అభిమానులు చెప్పినట్లే జరిగింది..మహర్షి దెబ్బ కు రంగస్థలం రికార్డ్స్ కనుమరుగయ్యాయి. వంశీపైడిపల్లి – మహేష్ బాబు కాంబినేషన్లో మహేష్ 25 వ చిత్రం గా తెరకెక్కిన మహర్షి చిత్రం గత వారం విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. మొదటి రోజే కొన్ని చోట్ల నాన్ బాహుబలి రికార్డ్స్ బ్రేక్ చేయగా..ఇప్పుడు ఫస్ట్ వీక్ కు గాను ఆంధ్ర – తెలంగాణ రాష్ట్రంలో రంగస్థలం రికార్డ్స్ బ్రేక్ చేసి నాన్ బాహుబలి రికార్డ్స్ లోకి ఎక్కింది.

బాక్సాఫీస్ ద‌గ్గ‌ర మ‌రో భారీ సినిమా ఏదీ లేక‌పోవ‌డంతో పూర్తిగా మ‌హేశ్ మేనియా నడుస్తుంది. తొలివారం ఇక్క‌డ 60 కోట్లు షేర్ వ‌సూలు చేయగా.. గ్రాస్ కూడా దాదాపు 80 కోట్ల‌కు పైగానే ఉంది. ఇక ప్ర‌పంచ వ్యాప్తంగా కూడా దాదాపు 75 కోట్ల వ‌ర‌కు తీసుకొచ్చాడు. ఈ చిత్రం సేఫ్ కావాలంటే మ‌రో 30 కోట్లు రావాలి. రెండో వారం కూడా మ‌హ‌ర్షి దూకుడు కొన‌సాగేలా క‌నిపిస్తుంది. ఇక ఓవర్సీస్ లో మాత్రం మహర్షి కి దెబ్బ పడింది.