రష్మీ ఆ సీన్లలో రెచ్చిపోతుందట..

‘గుంటూరు టాకీస్, అంతకు మించి, చారుశీల,‘నెక్ట్స్ నువ్వే’ వంటి సినిమాలతో హీరోయిన్ గా ప్రేక్షకులను అలరించిన జబర్దస్త్ ఫేమ్ రష్మీ..తాజాగా శివరంజని సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. నాగ ప్రభాకర్ దర్శకత్వంలో నందు, రష్మి హీరో హీరోయిన్లుగా నటించిన ఈ రొమాంటిక్ హారర్ చిత్రం ఫై రష్మీ గట్టి ఆశలే పెట్టుకుంది.

ఈ చిత్ర ట్రైలర్ రిలీజ్ సందర్భాంగా మీడియా తో ముచ్చటించింది. బోల్డ్ చిత్రాలే ఫై మీ కామెంట్స్ అని మీడియా అడుగగా…ఇలాంటి అడల్డ్ కంటెంట్ ఉన్న సినిమాల్లో నటించడానికి ఎలాంటి మెహమాటం లేదు. ప్రేక్షకులు నా నుంచి ఎలాంటివి కావాలనుకుంటున్నారో దర్శక,నిర్మాతలు అలాంటి పాత్రలే తీసుకొస్తున్నారంటూ కుండ బద్దలు కొట్టింది. ప్రస్తుతం శివరంజని ట్రైలర్ యూట్యూబ్ లో హలచల్ చేస్తుంది. రష్మీ హాట్ సన్నివేశాలకు..బోల్డ్ డైలాగ్స్ కు మళ్లీ మళ్లీ చూస్తున్నారు. మీరు కూడా ఈ ట్రైలర్ ఫై లుక్ వెయ్యండి.

…..