లిప్ లాక్ ఫై స్పందించిన రష్మిక..

గీత గోవిందం జోడి విజయ్ దేవరకొండ..రష్మిక మరోసారి డియర్ కామ్రేడ్ చిత్రంలో నటించారు. భరత్ కమ్మ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ మూవీ త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్ర ఫస్ట్ లుక్ టీజర్ ను తెలుగు , తమిళ్ , మలయాళం , కన్నడ భాషల్లో విడుదల చేసారు. అంతటా భారీ రెస్పాన్స్ రాగా..కన్నడ లో మాత్రం నెగిటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది. అంటే టీజర్ బాగాలేదని కాదు..రష్మిక విజయ్ ను ముద్దు పెట్టడం ఏంటి అని రక్షిత్‌ అభిమానులు రష్మిక ఫై ట్రోల్ చేయడం మొదలు పెట్టారు.

గతంలో రష్మిక-రక్షిత్ ప్రేమించుకున్న సంగతి తెలిసిందే. వాళ్ల వ్యవహారం ఎంగేజ్ మెంట్ వరకు వెళ్లింది. అయితే ఎంగేజ్ మెంట్ తర్వాత పెళ్లి కాన్సిల్ అయింది. రక్షిత్ ను తను పెళ్లి చేసుకోవడం లేదంటూ రష్మిక స్వయంగా ప్రకటించింది.

అప్పటి నుండి రక్షిత్ ఫ్యాన్స్ ఆమెపై కక్షకట్టారు. సోషల్ మీడియాలో రష్మికపై ఎప్పటికప్పుడు విరుచుకుపడుతూనే ఉన్నారు. ఇలాంటి టైమ్ లో విజయ్ దేవరకొండ, రష్మిక ముద్దు సీన్ బయటకు రావడంతో వారు విపరీతంగా ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. దీంతో రష్మిక తనఫై ట్రోల్ అవ్వడం పట్ల సీరియస్ అయ్యింది.

సినిమా చూడకుండా ఓ సీన్ చూసి నిర్ణయానికి వచ్చేయడం కరెక్ట్ కాదు.. మేలో సినిమా చూశాక అక్కడ ఆ లిప్ లాక్ అవసరమో కాదో మీరే చెప్తారు. కథ డిమాండ్ చేయకుండా అలాంటి సన్నివేశాలు ఉండవు అంటూ లిప్ లాక్‌పై క్లారిటీ ఇచ్చింది రష్మిక. మరి ఈ క్లారిటీ తో ఫ్యాన్స్ శాంతిస్తారో..లేక ఇంకా రెచ్చిపోతారో చూడాలి.