అభిమానులు సహనం తో ఉండాలని సూచించిన రష్మిక..

‘ఛలో’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచమైన కన్నడ బ్యూటీ రష్మిక..మొదటి చిత్రంతోనే యూత్ ను కట్టిపడేసింది. తాజాగా ‘గీత గోవిందం’ చిత్రంతో స్టార్ హీరోయిన్స్ జాబితాలో చేరిపోయింది. ప్రస్తుతం ఈమె నాని – నాగార్జునలు కలిసి నటించిన మల్టీస్టారర్ చిత్రం ‘దేవదాస్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఈ మూవీ లో నానికి జోడీగా ఈమె నటించింది. ఈ సినిమా కూడా హిట్ అయితే ఇక రష్మిక ను ఆపడం ఎవరి వల్ల కాదు. ఇప్పటికే అమ్మడికి వరుస అవకాశాలు తలుపు తడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈమెఫై కొన్ని పుకార్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఈమె ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ అయ్యిందనే వార్త చక్కర్లు కొడుతుంది. ఈ వార్త రష్మిక వరకు వెళ్లడం తో ఈ వార్తలపై ఆమె స్పందించింది.

తాజాగా రష్మిక తన అమ్మగారితో కలిసి తుమకూరు సిద్ధగంగ మఠాధిపతి శివకుమారస్వామిని దర్శించుకొని అయన ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ అయిందని తెలిపింది. కానీ ఈ విషయంలో తనపై వస్తున్న రూమర్లను నమ్మవద్దని అభిమానులను- ప్రేక్షకులను కోరింది. సమయం వచ్చినప్పుడు కారణాలను వెల్లడిస్తామని అంతవరకూ సహనంతో ఉండమని రిక్వెస్ట్ చేసింది.