రవితేజని కనకదుర్గ కాపాడుతుందా ?


మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం ప్లాపుల్లో ఉన్నాడు. ‘రాజా ది గ్రేట్’ రవితేజ ఆఖరి హిట్. ఈ సినిమా తర్వాత రవితేజ నటించిన టచ్ చేసి చూడు, నేల టికెట్, అమర్ అక్భర్ ఆంథోని ప్లాప్ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఓ హిట్ తో మళ్లీ హిట్ ట్రాక్ లోకి రావాలని మాస్ మహారాజా ఆశపడుతున్నాడు. ఇందుకోసం ఆయన విఐ ఆనంద్ తో ‘డిస్కోరాజా’ సినిమాలో నటిస్తున్నారు.

ఈ సినిమా తర్వాత సంతోష్ శ్రీనివాస్ తో దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. ఇది తమిళ్ హిట్ చిత్రం తేరికి రిమేక్. ఈ చిత్రానికి కనకదుర్గ టైటిల్ ని ఫిక్స్ చేసినట్టు సమాచారమ్. ఒకవేళ డిస్కోరాజా అటు ఇటైనా కనకదుర్గ తనని కాపాడుతుంది. హిట్ అందిస్తుందనే నమ్మకంతో రవితేజ ఉన్నట్టు తెలుస్తోంది. మరీ.. మాస్ మహారాజాపై కనకదుర్గ ఆశీస్సులు ఏ మేరకు ఉన్నాయన్నది చూడాలి.