వందేళ్ల కథని చూపించబోతున్న జక్కన్న


ఎన్టీఆర్, రామ్ చరణ్ కథానాయకులుగా రాజమౌళి మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా విశేషాలని రాజమౌళి మీడియాకు వివరించారు. ఇది ఫ్రీడమ్ ఫైటర్స్ అల్లూరి సీతారామ రాజు, కొమరం భీమ్ ల కథ. వీరిద్దరు సమకాలీకులు. వీరిద్దరిలో గల కామన్ పాయింట్ తో సినిమా తెరకెక్కిస్తున్నట్టు తెలిపారు.

1920 ప్రాంతంలో జరిగిన కథ. సరిగ్గా వందేళ్లకు మీరు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారని.. ఓ మీడియా ప్రతినిధి రాజమౌళి అడిగారు. అవును అది నిజమే. ఆ విషయం నాకు స్ట్రయిక్ కాలేదని నవ్వేశారు. 1920లో జరిగిన కథని 2020లో చూపించబోతున్నారు. ఈ లెక్కన వందేళ్ల కథని జక్కన్న చూపించబోతున్నారు.