#RRR బడ్జెట్ రూ. 400కోట్లు.. !


ఎన్టీఆర్, రామ్ చరణ్ కథానాయకులుగా రాజమౌళి మల్టీస్టారర్ #RRR తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా విశేషాలని తెలిపేందుకు ఆర్ఆర్ఆర్ చిత్రబృందం బుధవారం ప్రత్యేక ప్రెస్ మీట్ ని నిర్వహించింది. అల్లూరి సీతారామరాజు, కొమరం భీంల కథ. వీరిద్దరిలో ఉన్న ఓ కామన్ పాయింట్ ఆధారంగా సినిమా తెరకెక్కిస్తున్నామని రాజమౌళి తెలిపారు.

ఈ సినిమా కూడా బాహుబలి రేంజ్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. ఈ మల్టీస్టారర్ కోసం రూ. 350-400కోట్ల మధ్య బడ్జెట్ ని ఖర్చు చేస్తున్నట్టు నిర్మాత డివివి దానయ్య తెలిపారు. బాహుబలి మాదిరిగా రెండు భాగాలుగా కాకుండా #RRR ఒకే భాగంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. 2020 జూన్ 30న సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోటున్నట్టు చిత్రబృందం ప్రకటించింది.