ప్రదీప్ హీరోగా భారీ బడ్జెట్ చిత్రం


యాంకర్ ప్రదీప్ హీరోగా టర్న్ తీసుకొన్న సంగతి తెలిసిందే. ఆయన హీరోగా నటిస్తున్న చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉంది. సుకుమార్ దగ్గర అసిస్టెంట్ గా పని చేసిన మున్నా ఈ సినిమాకి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. గతేడాది ఈ సినిమా స్టోరీ ప్రదీప్ కి వినిపించగా తనకి తెగ నచ్చేయడం తో సినిమా సెట్ పైకి వెళ్ళింది.అయితే ఈ సినిమాని ఒక పీరియాడిక్ డ్రామా కథ తో తెరకెక్కిస్తున్నారు.

ఈ కథ 1947 సమయం లో జరిగే ప్రేమ కథ ఆధారంగా ఉంటుందట. ఈ సినిమా ముందుగా కోటి రూపాయలలో పూర్తి చేయలనుకున్నారట , అయితే కథ డిమాండ్ చేయడం తో ఈ సినిమా బడ్జెట్ 4 కోట్ల వరకు అయిందని అంటున్నారు. యాంకర్ ప్రదీప్ తో 4 కోట్ల బడ్జెట్ సినిమా అంటే అతని రేంజ్ కి అది భారీ బడ్జెట్ గానే పరిగణలోకి వస్తుంది. మరీ అంత మొత్తాన్ని ప్రదీప్ తీసుకొస్తారేమో చూడాలి.