సాహో పునర్జన్మల కధనా ?

saahoo-telugu-heroine

‘బాహుబలి’తో సంచలనం సృస్టించిన ప్రభాస్.. ఇప్పుడు సాహో సంచలనం రేపడానికి రెడీ అవుతున్నాడు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో శ్రద్దా కపూర్ హీరోయిన్. ఇప్పుడు ఈ సినిమా పై ఓ ఆసక్తికరమైన న్యూస్ వినిపిస్తుంది.

ఈ కథ పునర్జన్మ నేపథ్యంలో కొనసాగుతుందనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. బ్రిటీష్ వారి పరిపాలనా కాలంలోను .. స్వాతంత్య్రం వచ్చిన తరువాత .. ఇలా రెండు వేర్వేరు కాలాల్లో ఈ కథ కొనసాగుతుందని చెబుతున్నారు. బ్రిటీష్ వారి కాలంలో షూటింగ్ చేయవలసి రావడం వల్లనే, భారీ బడ్జెట్ అవుతుందని అంటున్నారు.

మొన్నటివరకూ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరిగింది. రీసెంట్ గా ఫస్టు షెడ్యూల్ ను పూర్తి చేసుకున్న ఈ సినిమా, రెండవ షెడ్యూల్ కి రెడీ అవుతోంది. ఈ సినిమా సుజీత్ దర్శకుడు.