ఇన్నాళ్లు మాస్, యాక్షన్ ఎంటర్ టైనర్స్ తో ఆకట్టుకొన్నాడు మెగా యంగ్ హీర్ సాయిధరమ్ తేజు. ఇప్పుడీ యంగ్ హీరో ప్రేమికుడిగా కనిపించబోతున్నాడు. తన ప్రేమకథని ప్రేక్షకులకి చూపించబోతున్నాడు. ప్రేమకథల స్పెషలిస్టు కరుణాకరణ్ దర్శకత్వంలో తేజు సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ ని పూర్తి చేసుకొంది.

తేజు సరసన అనుపమ పరమేశ్వరన్ జతకట్టనుంది. ఈ ప్రేమకథా చిత్రానికి ‘దేవుడు వరమందిస్తే’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. ఇప్పటికే ఈ టైటిల్ ని ఫిల్మ్ ఛాంబర్ లో రిజిస్టర్ కూడా చేయించారు. దాదాపుగా ‘దేవుడు వరమందిస్తే’ టైటిల్ ఫిక్స్ అయినట్టేనని చెబుతున్నారు. ఈ చిత్రానికి సంగీతం గోపీ సుందర్, ఈ ప్రేమకథా చిత్రాన్ని జూన్ 14న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

Latest News