సాయి పల్లవికి రెండు కోట్ల ఆఫర్

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్స్ ఒక్కో సినిమాకి రూ. కోటి, కోటిన్నర తీసుకొంటున్నారు. ఐతే, ఫిదా బ్యూటీ సాయి పల్లవికి ఏకంగా రూ. 2కోట్ల ఆఫర్ వచ్చింది. అది కూడా సినిమా కాదు. ఓ వాణిజ్య ప్రకటన కోసం. ఓ ప్రముఖ ఉత్పత్తుల సంస్థ తమ ఫేస్‌ క్రీమ్‌కు ప్రచారకర్తగా ఉండమని ఆమెను కోరినట్లు సమాచారం. దీనికి పారితోషికంగా రూ.2 కోట్లు ఇస్తామని కూడా సంస్థ పేర్కొందట.

కానీ ఆమె నో చెప్పినట్లు తెలిసింది. తనే మేకప్‌ వేసుకోకుండా సినిమాల్లో నటిస్తున్నానని, అలాంటిది ఫేస్‌ క్రీమ్‌ వాడమని ఎలా ప్రోత్సహించాలని అడిగిందట. దీంతో మేకప్‌ లేకుండా అలానే ప్రకటనలో నటించమని కోరినా.. ఆమె తిరస్కరించినట్లు చెబుతున్నారు. అందుకే అంటారేమో సాయి పల్లవి కమర్షియల్ కాదు. ఆమెని డబ్బుతో కొనలేమని.