తేజ సినిమాపై ‘సాక్ష్యం’ ఎఫెక్ట్


యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాలు భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంటాయి. ‘సాక్ష్యం’ ఏకంగా రూ. 42 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కింది. సినిమా తుస్సుమనడంతో.. దాదాపు రూ. 30కోట్ల లాభాలు వచ్చినట్టు తెలుస్తోంది. ఇప్పుడీ ఎఫెక్ట్ ఆయన తదుపరి సినిమాలపై పడినట్టు చెబుతున్నారు.

ప్రస్తుతం తేజ దర్శకత్వంలో బెల్లకొండ ఒక సినిమాలో చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో కాజల్ హీరోయిన్ గా నటిస్తోంది. మరో హీరోయిన్ గా పాయల్ రాజ్ పుత్ ని తీసుకొన్నారు. ఇప్పుడీ సినిమాపై ‘సాక్ష్యం’ ఎఫెక్ట్ పడినట్టు సమాచారమ్. ఈ సినిమా బడ్జెట్ లో 30% కాస్ట్ కటింగ్ జరిగిందని తెలిసింది. వంశధార క్రియేషన్స్ బ్యానర్ లో బెల్లంకొండ శ్రీనివాస్ మరో సినిమా కూడా చేస్తున్నాడట.
ఈ సినిమాలపై కూడా సాక్ష్యం ఎఫెక్ట్ పడిందని చెబుతున్నారు.