‘భారత్’లో సల్మాన్ ఫస్ట్ లుక్.. చూశారా ?


అలీ అబ్బాస్‌ జాఫర్‌ దర్శకత్వం సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘భారత్’. కత్రినా కైఫ్ హీరోయిన్. ఇందులో సల్మాన్ 20యేళ్ల యువకుడి నుంచి 70యేళ్ల వృద్దుడు వరకు పలు గెటప్స్ లో కనిపిస్తారట. తాజాగా, ఈ సినిమా నుంచి సల్మాన్ ఖాన్ ఫస్ట్ లుక్ ని విడుదల చేసింది చిత్రబృందం. ఇందులో సల్మాన్ ఏజెడ్ లుక్ లో కనిపిస్తున్నారు.

ప్రస్తుతం సల్మాన్ ఖాన్ భారత్ సినిమాతో పాటుగా దబాంగ్ 3 సినిమాలోనూ నటిస్తున్నారు. ఈ చిత్రానికి ప్రభుదేవా దర్శకత్వం వహిస్తున్నారు. సోనాక్షి సిన్హా హీరోయిన్. ఈ రెండు సినిమాలు కూడా సల్మాన్ ఖాన్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తాయని చెబుతున్నారు.