మొదటి పెళ్లి రోజు నాడే ప్రారంభించబోతున్నారు..

తెరపై భార్య భర్తలు గా నటించిన నాగ చైతన్య – సమంత లు నిజ జీవితంలో ఒకటై హ్యాపీ గా తమ లైఫ్ ను కొనసాగిస్తున్నారు. ఇద్దరు కూడా తమ సినిమాలతో బిజీ గా గడుపుతూ తమ దాంపత్య జీవితాన్ని సజావుగా చూసుకుంటున్నారు. చైతు నటించిన శైలజా రెడ్డి అల్లుడు, సమంత యూటర్న్ సినిమాలు
రేపు వినాయక చవితి కానుకగా విడుదల అవుతున్నాయి.

మరోపక్క వీరిద్దరూ కలిసి మరో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఏం మాయచేశావే సినిమా తరువాత ఇద్దరు కలిసి ఆటో నగర్ సూర్య, మనం సినిమాలో నటించారు. ఇప్పుడు మరోసారి ఈ ఇద్దరు స్క్రీన్ ను పంచుకోబోతున్నారు. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న కొత్త సినిమాలో వీరిద్దరూ నటించబోతున్నారు. ఇక ఈ సినిమాను వారి పెళ్లి రోజునే ప్రారభించబోతుండడం విశేషం. అక్టోబర్ 6 వ తేదీన వీరిద్దరూ ఒకటై కాగా అదే రోజు ఈ సినిమా ప్రారంభం కాబోతున్నది. నాగ చైతన్య.. సమంత ఫస్ట్ యాన్యువల్ వెడ్డింగ్ డే కానుకగా ఈ సినిమాను ప్రారంభించాలని దర్శక , నిర్మాతలు ప్లాన్ చేసారు. గోపి సుందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.