సమంత.. గిన్నీస్‌ బుక్‌లో రికార్డ్‌ !

సమంత తొలిసారి చేస్తున్న లేడీ ఓరియెంటెడ్ చిత్రం ‘యూటర్న్’. కన్నడ బ్లాక్ బస్టర్ హిట్ ‘యూ టర్న్’కు రిమేక్ ఇది. తెలుగు రిమేక్ కు మాతృక దర్శకుడు పవన్ కుమార్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో ఆది పినిశెట్టి, రాహుల్ రవీంద్రన్, భూమిక కీలకమైన పాత్రలను పోషిస్తున్నారు. వినాయక చవితి కానుకగా యూటర్న్ రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సినిమా ప్రీ-రిలీజ్ వేడుక హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకి నాగార్జున ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నాగ్ మాట్లాడుతూ.. “రేపు రిలీజ్ అవుతున్న సినిమాల రిజల్ట్ తెలుసుకునేందుకు ఎదురుచూస్తున్నా. ముఖ్యంగా సమంత ‘యు టర్న్‌’ సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రిలీజ్‌ అవుతోంది. సమంత నటించిన తమిళ సినిమా ‘సీమరాజా’ కూడా రేపే ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ విషయం గురించి ఇప్పుడే సమంతను అడుగుతున్నా గిన్నీస్‌ బుక్‌లో రికార్డ్‌ కోసం ట్రై చేస్తున్నావా.. ఒకే రోజు మూడు సినిమాలు రిలీజ్ చేస్తున్నావ్’ అన్నారు.