సమంతలో కొత్త యాంగిల్

సమంత ఇప్పుడు ఓ బ్రాండ్. ఎలాంటి సినీ నేపధ్యం లేకుండా ఇండస్ట్రీకి వచ్చి స్టార్ గా ఎదిగింది. ఇప్పుడు సమంత అంటే టాప్ హీరోయిన్. అక్కినేని వారి ఇంటి కోడలు. పెళ్లి తర్వాత కూడా మూడు హిట్లు కొట్టింది సమంత. అంతేకాదు ఇప్పుడు సినిమా నిర్మాతగా మారుతుందని చెబుతుంది.

“సినిమాలు నిర్మించాలని ఉంది. కాకపోతే అన్నపూర్ణ స్టుడియోస్ బ్యానర్ పై నిర్మించను. మనం ఎంటర్ టైన్ మెంట్స్ పై కూడా సినిమాలు తీయను. నా డబ్బుతో నేను సొంతంగా చిన్న సినిమాలు నిర్మిస్తాను. నాకు నా సినిమాను స్క్రీన్ పై చూసుకోవాలని ఉంది. కొత్తవాళ్లతో తీస్తాను. కొత్త టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తాను. ఇప్పటికే పలు ప్రపోజల్స్ వచ్చాయి. అయితే నేను ఎప్పుడు నిర్మాతగా మారతానో నాకే తెలీదు. దానికింకా చాలా టైం ఉంది” అని చెప్పుకొచ్చింది సమంత.