సమంత కోసం లాఠీ ఛార్జ్


సమంతను చూడడానికి వచ్చిన ఓ అభిమాని అత్యుత్సాహం చూపి పోలీసుల చేతిలో లాఠీ దెబ్బలు తిన్న ఘటన అనంతపురం నగరంలోని సుభాష్ రోడ్డులో చోటు చేసుకుంది. ఓ మొబైల్‌ షోరూం ప్రారంభించడానికి సమంత ఈ రోజు అక్కడకు వచ్చింది. ఆమెను చూడడానికి స్థానికులు భారీగా తరలివచ్చారు. ఓ అభిమాని సమంతను చూడడానికి ముందుకు దూసుకొచ్చి అత్యుత్సాహం ప్రదర్శించడంతో పోలీసులు అతడిని వెనక్కినెట్టేశారు.

దీంతో ఆ అభిమాని పోలీసులపై తిరగబడే ప్రయత్నం చేయడంతో పోలీసులు స్వల్ఫ లాఠీ ఛార్జీ చేశారు. అనుకోని పరిణామంతో సమంత ఇబ్బంది పడినట్లు చెబుతున్నారు. కుర్రాడి ఉదంతంతో సీరియస్ అయిన పోలీసులు నిగ్రహం కోల్పోయి.. షోరూం దగ్గర పెద్ద ఎత్తున చేరుకున్న అభిమానులపై లాఠీ ఛార్జ్ చేయడంతో పలువురు గాయపడ్డారు.