సమంత పెళ్లిరోజు కానుక ఏంటో తెలిసిపోయింది… !


పెళ్లి తర్వాత సమంత కెరీర్ మరింత ఊపందుకొంది. ఈ యేడాది ఆమె వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ తో దూసుకెళ్తోంది. రంగస్థలం, మహానటి, అభిమన్యుడు సినిమాలతో వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకొంది. ఆమె నటించిన యూ టర్న్, సీమరాజా సినిమాలు వినాయక చవితి కానుకగా రేపు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

ఇక, పెళ్లి తర్వాత నాగ చైతన్య, సమంత జంటగా ఓ చిత్రం తెరకెక్కుతోంది. శివ నిర్వాణ దర్శకుడు. ఈ సినిమాకు ‘మజిలీ’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని అక్టోబరు 6న సెట్స్‌పైకి తీసుకెళ్లనున్నారు. ఆరోజు నాగ-సామ్ మొదటి పెళ్లిరోజుని జరుపుకోబోటున్నారు. చైతూతో సినిమాయే నాకు పెళ్లి రోజు కానుక అంటోంది సామ్.

ఇక, సామ్ యూటర్న్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కన్నడ బ్లాక్ బస్టర్ హిట్ ‘యూ టర్న్’కు రిమేక్ ఇది. తెలుగు రిమేక్ కు మాతృక దర్శకుడు పవన్ కుమార్ దర్శకత్వం వహించారు. ఇందులో ఆది పినిశెట్టి, రాహుల్ రవీంద్రన్, భూమిక కీలకమైన పాత్రలను పోషిస్తున్నారు.