పెళ్లి కూతురు స‌మంత ఫొటోలు.. మీకోసం

sam

నాగచైతన్య – సమంతల వివాహ వేడుక గోవాలో జరుగుతోన్న విషయం తెలిసిందే. ఈరోజు ఉదయం ఈ పెళ్లి వేడుకకి సంబంధించిన ఒక్కో ఫోటో బయటికొస్తోంది. అవి ప్రేక్షకులని తెగ ఆకట్టుకొంటున్నాయి. తాజాగా, పెళ్లి కూతురు సమంత తన ఫోటోలని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. పెళ్లి వేడుక‌లో తీసుకున్న త‌న ఫొటోల‌ను స‌మంత స్వ‌యంగా ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేస్తోంది. పెళ్లి దుస్తుల్లో స‌మంత మెరిసిపోతోంది. చిరున‌వ్వులు చిందిస్తూ ఉత్సాహంగా క‌న‌ప‌డుతోంది. ఆ ఫోటోలపై మీరు ఓ లుక్కేయండీ.. !

నేటి రాత్రి 11.52 గంటలకు పెళ్లి ముహూర్తం నిర్ణయించారు. అంతకుంటే ముందు మధ్యాహ్నం 3 గంటలకు నుండి సాయంత్రం 6 గంటల వరకు మెహందీ వేడుక జరుగనుంది. రేపు సాయంత్రం 5.30 గంటల నుండి 6.30 గంటల మధ్య క్రిస్టియన్ సాంప్రదాయం ప్రకారం వివాహ వేడుక జరుగనుంది.