‘సుచీ లీక్స్‌’ పై సమంత సినిమా

Samantha

సుచీ లీక్స్ ప్రకంపనలు మాములుగా సాగలేదు. సౌత్ సినిమా పరిశ్రమ అంతా సుచీ లీక్స్ పేరుతో ఓ వణుకు వణికింది. అయితే ఇప్పుడీ పాయింట్ పై నాగార్జున రాజుగారి గదిలో ప్రస్థావించారు. ఈ విష‌యాన్ని స‌మంతే చెప్పింది `లీక్స్‌` అంటూ వ‌చ్చిన వీడియోలు రేపిన సంచ‌ల‌నం చుట్టూ ఈ సినిమా తిర‌గ‌బోతోంద‌నిఓ హింట్ ఇచ్చింది సామ్. ఆ వీడియోలు చూసిన వాళ్ల‌కు, షేర్ చేసిన వాళ్ల‌కు, పంపిన వాళ్లకు ఈ సినిమాలో త‌న పాత్ర ఓ మెసేజ్ ఇవ్వ‌బోతోంద‌ని స‌మంత చెబుతుంది

రాజుగారి గ‌ది 2లో స‌మంత లా స్టూడెంట్‌గా క‌నిపించ‌బోతోంది. చాలా సెన్సిటీవ్ అయిన స‌మంత ఆత్మ‌హ‌త్య చేసుకోవాల్సిన ప‌రిస్థితులు వ‌స్తాయ‌ట‌. దానికి కార‌ణం.. ” లీక్స్’ లాంటి వ్యవ‌హార‌మే అని తెలుస్తోంది. క్లైమాక్స్ లో అమ్మాయిల గురించి స‌మంత చెప్పే డైలాగుల‌కు ఆకట్టుకుంటాయని యూనిట్ చెబుతుంది.