కేజీఎఫ్ సీక్వెల్ లో సంజయ్ దత్ ?


కన్నడ స్టార్ యశ్ ‘కేజీఎఫ్’.. కన్నడంతో పాటు దక్షిణాది భాషల్లోనూ సత్తా చాటింది. బాలీవుడ్ లో సూపర్ హిట్ అయ్యింది. ఏకంగా బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ ‘జీరో’తో పోటీపడింది. జీరోని మించి కలెక్షన్స్ రాబట్టింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా సీక్వెల్ ని తీసుకురాబోతున్నాడు దర్శకుడు ప్రశాంత్ నీల్.

సీక్వెల్ కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఐతే, సీక్వెల్ లో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ నటిస్తున్నారంట. సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ కీలక పాత్రలో కనిపించబోతున్నట్టు సమాచారమ్.

మరోవైపు, కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ యంగ్ రెబల్ స్టార్ తో ఓ సినిమా చేసేందుకు ప్లాన్ చేసుకొన్నట్టు ప్రచారం జరుగుతోంది. యూనివర్సల్ కథతో ఆ సినిమా ఉండబోతుందని టాక్. ప్రస్తుతం ప్రభాస్ సాహో తో పాటు రాథాకృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తూ బిజీగా ఉన్నారు. ఈ రెండు సినిమాల తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ సినిమాపై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.