చైతు ఫై కొరటాల ప్రశంసలు..

మొత్తానికి నాగ చైతన్య హిట్ కొట్టడం తో అక్కినేని అభిమానులతో పాటు సమంత అభిమానులు సైతం పండగ చేసుకుంటున్నారు. గత కొంతకాలం గా సరైన హిట్ కోసం చూస్తున్న చైతు కు మజిలీ రూపంలో బ్లాక్ బస్టర్ వచ్చేసరికి తన ఆనందానికి అవధులు లేవు..తాజాగా మజిలీ యూనిట్ సక్సెస్ మీట్ ను గ్రాండ్ గా హైదరాబాద్ లో ఏర్పటు చేసారు..ఈ వేడుకకు ఇండస్ట్రీ నుండి అగ్ర దర్శకులతో పాటు పలువురు సినీ నటి నటులు హాజరయ్యారు.

కొరటాల శివ మాట్లాడుతూ “చైతన్యను చూసినప్పుడు నాకు ఎప్పుడూ నిజాయితీ కనిపిస్తుంది. ఆయన బలాలు బలహీనతలూ ఆయనకు తెలుసు. అంత నిజాయితీగా ఉంటారు కాబట్టే తన నటన గుర్తుండిపోతుంది. ఈ సినిమాలో పూర్ణను చూస్తుంటే అలాంటి వ్యక్తి వైజాగ్ లో ఉన్నారేమో అనిపించింది“ అంటూ ప్రశంసించారు. “చైతన్య మెయిన్ లీగ్లో ఉన్నారు. ఈ సినిమాలో చైతూ- సమంత మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా పండింది. మజిలీలో ఆవిడ చైతన్యను ఎలా చూసుకున్నారో బయట కూడా ఆమె అలాగే చూసుకుంటున్నారని అనుకుంటున్నాను“ అన్నారు.

అనీల్ రావిపూడి మాట్లాడుతూ.. పూర్ణ క్యారెక్టర్ చేసిన చైతన్య లో పూర్తి నటుడు కనబడ్డారు. ఆ పాత్రకు పూర్తిగా కనెక్టయిపోయాను. అంత బాగా చైతూ నటించారని కితాబిచ్చారు. నాగచైతన్యతో ఎప్పటి నుండో సినిమా చేయాలనుకుంటున్నాను. కానీ కుదరలేదు. సినిమా సినిమాకు తనదైన శైలిలో షైన్ అవుతున్నారని ప్రశంసించారు.