నాగబాబు స్నేహ హస్తం


మా ఎన్నికల సమయంలో నాగబాబు, శివాజీ రాజాల మధ్య వార్ మొదలైన సంగతి తెలిసిందే. అది ఇంకా కొనసాగుతోంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో శివాజీరాజా నాగబాబుకి వ్యతిరేకంగా ప్రచారం చేశారు. నరసాపురం జనసేన లోక్ సభ అభ్యర్థిగా నిలబడ్డ నాగబాబుకి ప్రజలు ఓటెయొద్దని శివాజీ రాజా కోరారు.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో నాగబాబు శివాజీ రాజాతో వైరంపై స్పందించారు. శివాజీరాజా అంశం చాలా చిన్నది. అంతకంటే పెద్ద విషయాలపై పోరాటం చేస్తున్నాను అన్నారు నాగబాబు. కొత్తవారికి అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతోనే నరేష్‌కు మా ఎన్నికల్లో మద్దతు తెలిపాను. గత రెండేళ్ల కాలంలో శివాజీ రాజా పనితీరుపై నాకే కాదు.. చాలా మందికి అసంతృప్తి ఉంది. అందుకే కొత్తవారికి అవకాశమిచ్చి చూద్దాం అనుకొన్నాం. నరేష్ కంటే నాకు శివాజీరాజానే ముఖ్యమని, సన్నిహితుడు అని నాగబాబు చెప్పుకొచ్చారు. మరీ.. వీరి మధ్య వార్ ముగుస్తుందేమో చూడాలి.