రాజశేఖర్ కూతురు ఓపెన్ అయ్యింది !

shivani

చాన్నాళ్ల తర్వాత “గరుడ వేగ” సినిమాతో దక్కిన విజయాన్ని రాజశేఖర్ ఫ్యామిలీ తెగ ఎంజాయ్ చేస్తోంది. సినిమా రిలీజ్ రోజున ఫ్యామిలీతో కలిసి రాజశేఖర్ వేసిన తీన్మార్ డ్యాన్సులు హైలైట్ అయిన సంగతి తెలిసిందే. శుక్రవారం రాజశేఖర్ ఫ్యామిలీ పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో సందడి చేసింది. ఈ సందర్భంగా హీరోయిన్ గా ఎంట్రీపై రాజశేఖర్ కూతురు శివాని ఓపెన్ అయ్యింది.

త్వరలోనే తాను హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతున్నా. తన తల్లిదండ్రులు రాజశేఖర్జీ – జీవితలను ఆదరించినట్టుగానే తనను కూడా ఆదరించాలని అభిమానులను కోరింది.
‘గరుడ వేగ’ సినిమాను ఇంత పెద్ద హిట్ చేసినందుకు చాలా ఆనందంగా ఉందని చెప్పింది. సినిమాలోకి ఎంట్రీ ఇస్తున్నట్టు వస్తున్న వార్తలపై శివాని గతంలో ఎప్పుడు నోరు విప్పలేదు. ఆమె తొలిసారి తెరంగేట్రంపై ఓపెన్ అయ్యిందని చెబుతున్నారు.