charan (8)

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ని భరించడం కష్టమని తేల్చేస్తున్నారు. చరణ్ – సుకుమార్ కలయికలో ఓ సినిమా ప్రారంభమైన విషయం తెలిసిందే. పల్లెటూరు నేపథ్యంలో సాగే అచ్చమైన ప్రేమకథ ఇదని చెబుతున్నారు. ఈ నెలాఖరు నుంచి రెగ్యూలర్ షూటింగ్ మొదలు కానుంది. తెరపై పల్లెవాతావారణం అతి సహజంగా కనిపించేందుకు సినిమాలోని అధిక భాగాన్ని ఏపీలోని గోదావరి జిల్లాలో ప్లాన్ చేశాడు దర్శకుడు సుకుమార్.

ఫస్ట్ షెడ్యూల్ కేరళలో.. అక్కడ ఓ ఫైట్ సీన్ ని ప్లాన్ చేశాడు. ఆ తర్వాత షూటింగ్ మొత్తం గోదావరి జిల్లాల్లోనే ఉండే విధంగా షెడ్యూల్ ఖరారు చేసుకొన్నాడు. ఇప్పటికే గోదావరి జిల్లాల్లో లొకేషన్స్ కూడా ఫైనల్ చేశారు. అయితే, చరణ్ ని భరించడం మా వల్ల కాదని ఏపీ పోలీసులు చేతులెత్తేసినట్టు సమాచారమ్.

తెలుగు రాష్ట్రాల్లో చరణ్ క్రేజ్ గురించి తెలిసిందే. ఆయన ప్లాప్ సినిమాలు కూడా రూ. 50కోట్ల క్లబ్ లో చేర్చిన ఘనత తెలుగు ప్రేక్షకులది. ఈ నేపథ్యంలో షూటింగ్ టైంలో భారీగా తరలివచ్చే ప్రేక్షకులని అదుపు చేయడం మా వల్ల కాదని ఏపీ పోలీసులు స్పష్టం చేసినట్టు చెబుతున్నారు. దీంతో.. తమిళనాడులోని పొలాచి, కారైకుడి ప్రాంతాలలో షూటింగ్ నిర్వహించేందుకు సుక్కు ఏర్పాట్లు చేసుకొంటున్నట్టు ఫిల్మ్ నగర్ సమాచారమ్.

ఇక, ఈ చిత్రంలో చరణ్ సరసన సమంత, రాశీఖన్నాలు జతకట్టనున్నారు. ఈ చిత్రానికి సంగీతం దేవిశ్రీ ప్రసాద్. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు.
Ram Charan and Sukumar's film under Mythri Movie

లేటెస్ట్ గాసిప్స్