ప్రభాస్ కోసం ఆగలేకపోతున్న హీరోయిన్

prabhas
తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇవ్వనుండడం పట్ల బాలీవుడ్‌ బ్యూటీ శ్రద్ధా పూర్‌ ఆనందం వ్యక్తం చేసింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్‌ మీడియాలో వెల్లడించింది. ప్రభాస్‌ సరసన ‘సాహో’ సినిమాలో శ్రద్ధా కపూర్‌ని హీరోయిన్‌గా ఎంపిక చేసిన విషయం విదితమే.

ప్రభాస్ లేటెస్ట్ చిత్రం సాహో. తెలుగు, తమిళం, హిందీ… ఈ మూడు భాషల్లో తెరకెక్కుతున్న చిత్రం కాబట్టి, అన్ని చోట్లా గుర్తింపు ఉన్న కథానాయికనే ఎంపిక చేసుకోవాలని చిత్రబృందం భావించింది. ఇందుకోసం శ్రద్ధా పూర్‌ ఫైనల్ చేసింది.

దీనిపై శ్రద్దా మాట్లాడుతూ.. ‘సాహో టీంలో నేనూ భాగమైనందుకు, టాలీవుడ్‌లో తొలి చిత్రంలోనే ప్రభాస్‌తో నటిస్తున్నందుకు చాలా చాలా ఆతృతగా, సంతోషంగా ఉంది.’అని ట్వీట్‌ చేసింది. తెలుగుతో పాటు హిందీ, మలయాళం, తమిళభాషల్లో ‘సాహో’ను రూపొందిస్తున్నారు. ఇందులో బాలీవుడ్‌ నటుడునీల్‌ నితిన్‌ ముఖేశ్‌ విలన్ పాత్ర పోషిస్తున్నారు. శంకర్ ఎసాన్ లాయ్ ఈ చిత్రానికి మ్యూజిక్.