#RRR కోసం ప్రభాస్ హీరోయిన్ ?

ఎన్టీఆర్, రామ్ చరణ్ కథానాయకులుగా రాజమౌళి మల్టీస్టారర్ #RRR తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టు నుంచి హాలీవుడ్ హీరోయిన్ డైసీ ఎడ్గర్ జోన్స్ తప్పుకోవడంతో.. ఆమె స్థానంలో కొత్త హీరోయిన్ ని ఎంపిక చేసే పనిలో జక్కన్న ఉన్నారు. నిత్యామీనన్, జాహ్నావి కపూర్ పేర్లు తెరపైకి వచ్చాయి. వీరిలో రాజమౌళి ఎవరిని ఫైనల్ చేస్తారనే ఆసక్తి నెలకొంది. ఇంతలో మరో హీరోయిన్ పేరు తెరపైకి వచ్చింది. ప్రభాస్ ‘సాహో’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అవుతున్న శ్రద్దా కపూర్ ని కూడా జక్కన్న టెస్ట్ చేయనున్నారట.

నిత్యామీనన్, జాహ్నవి కపూర్, శ్రదా కపూర్ లలో ఒకరిని ఫైనల్ చేయనున్నారు. ఇక రామ్ చరణ్ కాలికి గాయం కారణంగా వడోదర ఆర్ ఆర్ ఆర్ షెడ్యూల్ కి మూడు వారాల పాటు బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. త్వరలో తిరిగి షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ చిత్రాన్ని వచ్చే యేడాది జూన్ 30న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.