శ్రద్దా స్థానంలోకి పరిణీతి


బాలీవుడ్ హీరోయిన్ శ్రద్దా కపూర్ ప్రభాస్ ‘సాహో’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం కాబోతుంది. ఇటీవలే శ్రద్దా పుట్టినరోజు కానుకగా సాహోలో ఆమె ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు. సాహోతో పాటు తెలుగుతేజం, బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ బయోపిక్ శ్రద్దా నటిస్తోంది. ఐతే, ఈ సినిమాపై శ్రద్దా పెద్దగా ఆసక్తి చూపడం లేదని గతంలో సైనా అన్న సంగతి తెలిసిందే.

ఇప్పుడదే నిజం అయ్యింది. సైనా బయోపిక్ నుంచి శ్రద్దా తప్పుకొంది. ఆమె స్థానంలో పరిణీతి చోప్రాను తీసుకొన్నట్టు సమాచారమ్. ఉవున్నట్టుండి.. శ్రద్దా సైనా బయోపిక్ నుంచి ఎందుకు తప్పుకుంది ? అంటే.. షూటింగ్ సమయంలో ఆమె డెంగీ జ్వరం రావడంతో తప్పించారని పైకి చెబుతున్నారు. కానీ అసలు విషయం వేరేగా వుందని టాక్.

ఇక, సైనా బయోపిక్ కు అమోల్‌సేన్‌ గుప్తా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని 2021లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.