విజయ్’కి జంటగా శృతిహాసన్

హీరోయిన్ శృతిహాసన్ యేడాది కాలంగా సినిమాలకి దూరంగా ఉంటుంది. అవకాశాల్లేకే అనే ప్రచారం జరిగినా.. ఇన్నాళ్లు శృతి సంగీతంతో బిజీగా ఉంది. ఇటీవలే తనబృందంతో కలిసి ఫారిన్ లో మ్యూజిక్ షోస్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఐతే, ఇప్పుడు హృతి హీరోయిన్ గా మళ్లీ బిజీ కావాలని.. అందుకు తగ్గట్టుగా ప్లాన్ చేసుకొంటుందట.

ప్రస్తుతం శృతి చేతిలో ‘శభాష్‌ నాయుడు’ ఒక్కటే ఉంది. అది కూడా తొలి షెడ్యూల్‌లోనే ఆగిపోయిన విషయం తెలిసిందే. అలాగే సుందర్‌.సి డ్రీమ్‌ ప్రాజెక్టు ‘సంఘమిత్ర’లో నటించాల్సి ఉన్నప్పటికీ, స్వయంగా శ్రుతినే తప్పుకుంది. ఎస్‌పీ జననాథన్‌ దర్శకత్వం వహించనున్న కొత్త చిత్రంలో విజయ్‌ సేతుపతికి జోడీగా నటించే అవకాశం వచ్చినట్టు కోలీవుడ్‌ టాక్‌.

ఇక, తెలుగులో శృతిహాసన్ చేతిలో ఒక్క సినిమా కూడా లేదు. ఇక్కడ ఆమె పేరుని కూడా పరిగణలోనికి తీసుకొనే దర్శక-నిర్మాతలు కనబడటం లేదు. కోలీవుడ్ లో కాస్త టచ్ లో వస్తే.. టాలీవుడ్ లోనూ శృతికి ఆఫర్స్ రావొచ్చు.