ముద్దుగుమ్మ శృతిహాసన్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సూచనలని తూ.చ తప్పకుండా పాటిస్తున్నట్టు కనబడుతోంది. ఇటీవలే బాలీవుడ్ పై ఫోకస్ చేదామనుకొంటున్న శృతికి.. సౌత్ లో మరిన్ని సినిమాలు చేయాలని సూచించిన విషయం... బన్ని సినిమాపై శృతి చూపులు

shruti-hassan-allu-arjun

ముద్దుగుమ్మ శృతిహాసన్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సూచనలని తూ.చ తప్పకుండా పాటిస్తున్నట్టు కనబడుతోంది. ఇటీవలే బాలీవుడ్ పై ఫోకస్ చేదామనుకొంటున్న శృతికి.. సౌత్ లో మరిన్ని సినిమాలు చేయాలని సూచించిన విషయం తెలిసిందే. ఇప్పుడా సూచనలని ఆచరణలో పెడుతోంది శృతి. ఈ క్రమంలోనే టాలీవుడ్ లో క్రేజ్ సినిమాల్లో ఛాన్స్ కోసం ప్రయత్నాలు మొదలెట్టింది.

అల్లు అర్జున్ – శృతిహాసన్ జంటగా నటించిన ‘రేసుగుర్రం’ బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది. ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘దువ్వాడ జగన్నాథం’ సినిమా చేస్తున్నాడు బన్ని. ఈ చిత్రం తర్వాత వక్కంతం వంశీ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్ కోసం వేట కొనసాగుతోంది. అయితే, బన్ని సరసన మరోసారి జతకట్టేందుకు శృతిహాసన్ ఆసక్తి చూపుతోంది. ఈ మేరకు సంకేతాలు కూడా ఇస్తున్నట్టు తెలుస్తోంది. మరీ.. శృతికోరికని బన్ని తీరుస్తాడేమో చూడాలి.

Indywood Film Carnival
లేటెస్ట్ గాసిప్స్