వెళ్లు మిత్ర‌మా.. తిరిగిరాని నేస్త‌మా !

వైజ‌యంతి మూవీ బ్యాన‌ర్ పై చిరంజీవి – శ్రీ‌దేవి జంటగా ప్రేక్షకుల ముందుకొచ్చిన చిత్రం “జ‌గ‌దేక‌వీరుడు, అతిలోక‌సుంద‌రి”. రాఘవేంద్ర రావు దర్శకుడు. అప్పట్లో ఈ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్. ఆ మూవీలో న‌టించిన శ్రీ‌దేవి మ‌ర‌ణించ‌డంతో అశ్వ‌నీ ద‌త్ అప్ప‌టి జ్ఞాపకాల‌ను గుర్తు చేసుకున్నారు. ఆ మూవీలో దేవ‌క‌న్య‌గా న‌టించిన శ్రీ‌దేవి మూవీ క్లైమాక్స్ భూలోకం నుంచి దేవ‌లోకానికి వెళుతున్న స‌న్నివేశం ఉంది. ఆ స‌న్నీవేశాన్ని శ్రీ‌దేవికి నివాళిగా వీడియో రూపంలో విడుద‌ల చేశారు.
వెళ్లు మిత్ర‌మా.. తిరిగిరాని నేస్త‌మా అంటూ దీనికి టైటిల్ పెట్టారు.

ప్రస్తుతం వైజయంతి బ్యానర్ లో తెరకెక్కుతోన్న ‘మ‌హాన‌టి’ సావిత్రి జీవిత గాధను శ్రీ‌దేవికి అంకితం ఇస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు అశ్వ‌నిద‌త్. నాగ అశ్విన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. సావిత్రిగా కీర్తీ సురేష్ న‌టిస్తున్న‌ది. దుల్కర్ సల్మాన్, షాలినీ పాండే, విజయ్ దేవరకొండ, మోహన్‌బాబు తదితర నటులు ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు.