గాయని కె. రాణి ఇకలేరు

టాలీవుడ్ లో నేడు రెండు విషాదాలు చోటు చేసుకొన్నాయి. సీనియర్ నటుడు వినోద్ అరికెళ్ల మృతి చెందారు. ఆయన తెలుగు, తమిళ్, హిందీ, జోథ్ పురి భాషల్లో 300పైగా చిత్రాల్లో నటించారు. హీరో, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణించారు. ఈ షాక్ నుంచి తేలుకొనే లోపే మరో విషాద వార్త వినాల్సి వచ్చింది.

అలనాటి నేపథ్య గాయని కె. రాణి (75) కన్నుమూశారు. కళ్యాణ్ నగర్‌లోని తన పెద్ద కుమార్తె విజయ ఇంటిలో ఉంటున్న రాణి శుక్రవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. పది సంవత్సరాల వయసులోనే దేవదాసు చిత్రంలో “అంతాభ్రాంతియేనా జీవితానా వెలుగింతేనా ” అంటూ విషాదకర పాటతో పాపులర్ అయింది రాణి. ఆమె1951లో గాలివీటి సీతారామిరెడ్డిని వివాహం చేసుకున్నారు. అప్పటికే ఆమె పలు భాషల్లో 500 పాటలు పాడారు.