హీరోయిన్ తో పోటి పడుతున్న మహేష్ తనయ

మహేష్ బాబు ఫ్యామిలీ టైపు. ఆయనకి కొంచెం సమయం దొరికినా ఫ్యామిలీతో విదేశాలు చుట్టేస్తుంటారు. పిల్లలతో హ్యాపీగా విహరిస్తుంటారు. అలాగే సమయం పిల్లల్ని షూటింగ్ కి తీసుకువెళుతుంటారు. తాజాగా సితార పాప మహేష్ సెట్స్ లో సందడి చేసింది.

ఇప్పుడు మహేశ్ బాబు హీరోగా నటిస్తున్న సినిమా ‘భరత్ అనే నేను’. కొరటాల శివ దర్శకత్వంలో డి.వి.వి. దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్లో జరుగుతోంది. అన్నపూర్ణ సెవెన్ ఏకర్స్ స్టూడియోలో సాంగ్ తీస్తున్నారు. అక్కడికి కుమార్తె సితారను తీసుకుని వెళ్ళారు మహేశ్ సతీమణి నమ్రత. షూటింగ్ గ్యాప్ లో ‘భరత్ అనే నేను’ హీరోయిన్ కైరా అద్వానీతో సితార ఫొటో దిగింది. దీన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన నమ్రత “ఎవరి జుత్తు పొడవుగా వుంది? లాంగెస్ట్ హెయిర్ అవార్డు కోసం పోటీ పడుతున్నారు” అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చారు.