‘సీత’ సెన్సార్ రిపోర్ట్


తేజ దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్‌, కాజల్‌ జంటగా నటించిన చిత్రం ‘సీత’. అనూప్‌ రూబెన్స్‌ సంగీతం అందించారు. ఈ సినిమా మే 24న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తాజాగా, ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలని పూర్తి చేసుకొంది. ‘యు/ఎ’ సర్టిఫికెట్ పొందింది. దీంతో సీత విడుదలకి లైన్ క్లియర్ అయినట్టయింది.

సీత కథ చాలా భిన్నంగా ఉంటుందని సంగీత దర్శకుడు అనూప్ చెప్పిన సంగతి తెలిసిందే. సినిమాలో కాజల్, సోనూసూద్, బెల్లకొండ శీనివాస్ పాత్రలు బలంగా ఉంటాయట. ఇది తేజ రామాయమణం. తేజ సీత అగ్రెసివ్ గా ఉండబోతుందని ముందే చెప్పారు. టీజర్, ట్రైలర్ లలో అది కనబడింది.