‘స్పైడర్’ లాస్ లెక్కెంత ?

Spyder kollywood theaters

భారీ అంచనాల మధ్య దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చిన మురగదాస్ – మహేష్’ల ‘స్పైడర్’.. చివరికి నష్టాలనే మిగిల్చింది. ఇప్పుడు తెలుగు ‘స్పైడర్’ లాభాల లెక్క తేలినట్టేనని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. తెలుగు ‘స్పైడర్’ రూ. 70కోట్లకి అమ్ముడుపోయింది. తొలివారం స్పైడర్ రూ. 31కోట్ల షేర్ ని రాబట్టింది. అయితే, రెండో వారం వసూళ్లు భారీగా పడిపోయాయి. రెండు వారాల్లో ఈ మొత్తం షేర్ విలువ 33 కోట్ల 32 లక్షలు మాత్రమే. మొత్తం కలిపి రూ. 35కోట్ల షేర్ ని రాబట్టేలా కనిపిస్తోంది. ఈ లెక్కన తెలుగు ‘స్పైడర్’ రూ. 35కోట్ల లాస్ ని మిగిల్చినట్టు తెలుస్తోంది.

ఇక, ఏరియాల వారీగా స్పైడర్ కలెక్షన్స్ పై ఓ లుక్కేస్తే..
నైజాం – రూ. 9.90 కోట్లు, సీడెడ్ – రూ. 4.80 కోట్లు, ఉత్తరాంధ్ర – రూ. 3.95 కోట్లు, ఈస్ట్ – రూ. 3.82 కోట్లు, వెస్ట్ – రూ. 2.90 కోట్లు, గుంటూరు – రూ. 3.65 కోట్లు, కృష్ణా – రూ. 2.45 కోట్లు, నెల్లూరు – రూ. 1.85 కోట్లు, మొత్తం.. రూ. 33.32 కోట్లు షేర్ ని మాత్రమే రాబట్టింది.