శైలజారెడ్డి అల్లుడు మూడు రోజుల వసూళ్లు..

నాగచైతన్య, అను ఇమ్మానుయేల్ జంటగా రమ్యకృష్ణ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘శైలజారెడ్డి అల్లుడు’. మారుతీ డైరెక్షన్లో రూపుదిద్దుకున్న ఈ మూవీ వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మిక్సెడ్ టాక్ వచ్చినప్పటికీ బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది.

మొదటి మూడు రోజుల్లోనే ఈ సినిమా 23 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టినట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. చైతు కెరియర్ లోనే హైయెస్ట్ కలెక్షన్లు గా నిలువడం అందర్నీ ఆశ్చర్య పరుస్తుంది. ఈ కలెక్షన్లు చూసి అక్కినేని అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. గత రాత్రి చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ ను ఏర్పటు చేసి చిత్ర విజయాన్ని అభిమానులతో పంచుకున్నారు..