పాపం.. నాని అన్న అనేసింది !

మనతో రొమాన్స్ చేసిన అమ్మాయే.. మనని అన్నా అంటే ఎలాగుంటుంది. సొంత లవ్వర్ అన్న అని పిలిస్తే కలిగే చిరాకు కలుగుతుంది. నేచురల్ స్టార్ ని కి ఇలాంటి పరిస్థితియే ఎదురైంది. నాని తాజా చిత్రం జెర్సీ. ఇందులో నానికి జంటగా శ్రద్దా శ్రీనాథ్ నటించారు. వీరిమధ్య రొమాంటిక్ సన్నివేశాలని ట్రైలర్ లో చూశాం. ఐతే, ఆదివారం జరిగిన జెర్సీ ఆడియో వేడుకలో శ్రద్దా శ్రీనాథ్ నాని పరువు తీసింది. వేదికపై నుంచే అన్న అని పిలిచింది.

తన ప్రసంగానికి ముందు శ్రద్దా తనని తాను పలుమార్లు పరిచయం చేసుకొంది. నా పేరు శ్రద్దా శ్రీనాథ్. థియేటర్ ఆర్టిస్ట్ ని. కన్నడ యూటర్న్ తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చా. ప్రస్తుతం కన్నడ, తెలుగు, మలయాళం, హిందీ బాషల్లో నటిస్తున్నా. ఆమె మాట్లాడుతున్న సమయంలో నాని అభిమానులు గోల చేశారు. దీంతో జై నాని అన్న అంటూ అభిమానులని ఉత్సాహపరిచింది. కానీ, నానికి దిగాలు పరిచింది. నాని ఏమీ అనుకోకపోయినా.. ఆయన అభిమానులు మాత్రం శ్రద్దా నానిని అన్న అనేసిందని గుసగులాడుకొంటున్నారు.