శ్రీదేవి మరణంపై చెల్లలు రియాక్షన్ ఇది

శ్రీదేవి మరణంపై ఎట్టకేలకు ఆమె చెల్లులు వైపు నుండి స్పందన వచ్చింది దేవి చెల్లెలు శ్రీలత భర్త సంజయ్‌ రామస్వామి ఓ ప్రకటన చేశారు. ఈ క్లిష్ట సమయంలో బోనీ కపూర్‌కు కుటుంబం అండగా ఉంటుందని ఈ ప్రకటన లో చెప్పారు.

‘కొన్ని పత్రికలు నా భార్య శ్రీలత మౌనంగా ఉందంటూ.. లేనిపోని తప్పుడు వార్తలు రాస్తున్నారు. వారికి ఆప్తులు ఉంటారు.. ఏదో ఒక సమయంలో వారిని పోగొట్టుకుని ఉంటారు. అప్పుడు వారు గోడపై నిల్చొని గట్టిగా అరిచారా?.. మేము మౌనంగా ఉన్నాం.. మాకు పబ్లిసిటీ అవసరం లేదు. శ్రీదేవి మా కుటుంబంలో అందరికీ స్ఫూర్తి. మొత్తం కుటుంబ సభ్యులు ఆమెను ఎంతో ప్రేమిస్తారు’ అని ఆయన ప్రకటనలో వెల్లడించారు.