మరికొద్దిసేపట్లో.. ముంబై చేరనున్నశ్రీదేవి మృతదేహం

అనంతలోకాలకు వెళ్లిపోయిన అతిలోక సుందరి శ్రీదేవిని కడసారి చూసేందుకు ముంబైలోని ఆమె ఇంటికి అభిమానులు భారీ ఎత్తున త‌రలి వ‌స్తున్నారు. ఈ నేపథ్యంలో అంధేరిలోని శ్రీదేవి నివాసం వ‌ద్ద పోలీసులు భారీ బందోబ‌స్త్ ఏర్పాటు చేశారు.

మ‌రోవైపు, శ్రీదేవి మృతదేహాన్ని ముంబైకి తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మ॥3గం॥ల కల్లా శ్రీదేవి మృతదేహం ముంబైకి చేరే అవకాశం ఉంది. ఇప్పటికే దుబాయ్ లో ఫోరెన్సిక్ ప‌రీక్ష‌లు అన్ని పూర్తైనట్టు సమాచారమ్. దుబాయ్ నుండి ముంబైకి చార్టర్డ్ ఫ్లైట్‌లో మృతదేహాన్ని తీసుకురానున్నారు. జుహూ శ్మశానవాటికలో ఆమె అంత్యక్రియలను నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. రేపు (సోమవారం) సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించనున్నారు.