కళ్యాణం కలెక్షన్స్ పెరిగాయ్.. !

అంచనాలు పెంచేయడమే ‘శ్రీనివాస కళ్యాణం’ కొంపముంచింది. ఈ విషయాన్ని నిర్మాత దిల్ రాజు ఒప్పేసుకొన్నారు. శ్రీనివాసకళ్యాణం విషయంలో చాలా ఎక్కువగా మాట్లాడి తప్పు చేసామని ఆయన తెలిపారు. గురువారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా మిక్సిడ్ టాక్ ని సొంతం చేసుకొంది. పెళ్లి పేరుతో నస పెట్టారనే కామెంట్స్ వినిపించాయి.

ఈ ప్రభావం శుక్రవారం కలెక్షన్స్ పడింది. ఐతే, శనివారం మాట్నీ, ఫస్ట్ షో, సెకెండ్ షో లు మాత్రం చాలా చోట్ల ఫుల్స్ కావడం జరిగింది. ఈ ట్రెండ్ చూస్తుంటే ఆదివారం కూడా బాగానే వుండేలా వుంది. ఆ లెక్కన ఫస్ట్ వీకెండ్, ఓ ఆరేడు కోట్ల వరకు లాగేలా వుంది. ఈ లెక్కలు దిల్ రాజుకు కాస్త ఆశ కలిగించి వుంటాయి. ఫైనల్ గా శ్రీనివాస కళ్యాణం లాస్ లెక్కెంత ? అనేది మరో వారం, పది రోజుల్లో తేలనుంది.