శ్రీనివాస్ రెడ్డి అవసరమా నీకు..?

తెలుగు ఇండస్ట్రీ లో కాస్త పేరు..డబ్బు రాణిస్తే చాలు వారికీ ఎక్కడాలేని ఆలోచనలు వస్తాయి..తమ పని తాము చేసుకోకుండా వేరే వారు చేసే పని కూడా వారు చేసి చేతులు కాల్చుకుంటారు. తాజాగా కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి కూడా అదే చేయబోతున్నాడు. కమెడియన్ గా రాణిస్తూనే మరోపక్క హీరోగా నటిస్తూ గట్టిగానే సంపాదిస్తున్నాడు. కాగా ఇప్పుడు డైరెక్టర్ గా మరి ఓ సినిమా చేస్తున్నాడు. గతంలో కమెడియన్స్ డైరెక్టర్స్ గా మరి డబ్బులు , పేరు పోగొట్టుకున్న సంగతి తెలిసిందే. అయినాగానీ శ్రీనివాస్ రెడ్డి తగ్గడం లేదు.

భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు పేరుతో ఓసినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో సీనియర్ నటీనటులే కాక జూనియర్ నటి నటులు కూడా నటిస్తున్నారు. ఈ మూవీని ఫ్లయింగ్ కలర్స్ పేరుతో తమ బ్యాచుకు పెట్టుకున్న పేరుతోనే సంయుక్తంగా బ్యానర్ పెట్టి నిర్మాతలుగా మారారు. రెండు రోజుల్లో ఈ సినిమాకు సంబందించిన అధికారిక ప్రకటన రానుంది. మరి ఈ సినిమా శ్రీనివాస్ రెడ్డి కి ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో చూడాలి.